కోడి పందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చింతలమానేపల్లి

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై సోమవారం పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. గూడెం గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని, పందాలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఐదు కోడిపుంజులు, నగదు, పందెం కత్తులతో పాటు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.