సేల్స్‌ఫోర్స్ భారీ విరాళം: విద్యా రంగానికి 27 మిలియన్ల డాలర్లు

రిపోర్టర్: రమేష్ స్థలం: World

అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధికి ప్రముఖ టెక్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ 27 మిలియన్ డాలర్ల భారీ విద్యా గ్రాంట్లను ప్రకటించింది. ఇందులో 18 మిలియన్ డాలర్లు నేరుగా శాన్ ఫ్రాన్సికో, ఓక్లాండ్, న్యూయార్క్ సిటీ, చికాగో, ఇండియానాపోలిస్ నగరాల పబ్లిక్ స్కూళ్లకు అందనున్నాయి. సంస్థ సీఈఓ మార్క్ బెనియోఫ్ మాట్లాడుతూ, విరాళాలకు ఎలాంటి కఠిన నిబంధనలు లేవని, పాఠశాలల్లో కేవలం వివక్ష లేని నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.