కర్ణాటకలో కోతి దాడి చేసి వృద్ధురాలి మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: కర్ణాటక
కర్ణాటకలోని కొప్పల్‌లో ఇంటి ఆవరణలో నడుస్తున్న 91 ఏళ్ల నజమున్నిసా బేగంపై ఒక కోతి దాడి చేసి కిందపడేసింది. తల్లిని కాపాడేందుకు వచ్చిన ఆమె కుమార్తెపై కూడా ఆ కోతి దాడికి దిగింది. తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరునాడు మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ప మీడియాలో వైరల్ అయ్యాయి.