భారతీయ తయారీ రంగంలో ఏడు నెలల గరిష్ట వృద్ధి నమోదు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

దేశంలో తయారీ రంగం కార్యకలాపాలు సెప్టెంబర్ నెలలో భారీగా పుంజుకున్నట్లు హెచ్ఎస్బీసీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ నివేదిక వెల్లడించింది. బలమైన దేశీయ మరియు విదేశీ డిమాండ్ కారణంగా అమ్మకాలు, ఉత్పత్తి గణనీయంగా పెరిగాయని హెచ్ఎస్బీసీ ప్రధాన ఆర్థికవేత్త ప్రంజుల్ భండారి తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్లో పీఎంఐ సూచీ 55.1 శాతానికి చేరిందని, గత ఏడు నెలల్లో ఇదే అత్యుత్తమ వృద్ధి అని ఆయన పేర్కొన్నారు. కంపెనీలు కొత్త నియామకాలను వేగవంతం చేయడంతో పాటు ముడిసరుకుల కొనుగోళ్లు, నిల్వలను పెంచినట్లు వివరించారు.