గిన్నిస్ రికార్డు సాధించిన కరాటే వేణును అభినందించిన మంత్రి పొంగులేటి

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం కరాటే క్రీడాకారుడు కరాటే వేణును రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా అభినందించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఏప్రిల్ 26న జరిగిన ప్రతిష్టాత్మక కరాటే కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా సాగిన ఈ వేడుకలో వేణు పాల్గొని రికార్డు సాధించడంలో కీలక భాగస్వామిగా నిలిచారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణమని మంత్రి కొనియాడారు.