పిఎసిఎస్ చైర్మన్ రాజీరెడ్డిని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నేతలు
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ అబ్బీడి రాజీరెడ్డిని యూత్ కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు కుల్ల యాకాంతం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.