గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీ లైబ్రరీలో భారీ అగ్నిప్రమాదం
రిపోర్టర్: రాజేష్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీ లైబ్రరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. వర్సిటీ భవనం ఐదో అంతస్తులోని సెంట్రల్ లైబ్రరీలో గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వేలాది పుస్తకాలు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయని పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనాయం తప్పిందని, ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.