సినిమా ప్రేమికులకు గుడ్ న్యూస్: నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు హై చిత్రం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

బ్లాక్బస్టర్ సినిమాల కో-రైటర్ ఎస్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హై సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇమేజ్స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి ఎస్ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్య శర్మ, పల్లవి దొర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్ఫుల్ ఎనర్జీ, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.