ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే బేబీ నాయన

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎన్డీయే కూటమి నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు అలియాస్ బేబీ నాయన ఆశీర్వాద దీపం వెలిగించారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వానికి సంఘీభావం తెలుపుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.