మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి: మంత్రి కొండపల్లి
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయనగరం
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణ పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. నిమజ్జనం, ఊరేగింపు సమయాలలో విద్యుత్ భద్రతా నియమాలు పాటించాలని, పోలీసుల సూచనలు తూచా తప్పకుండా పాటించి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.