బొత్స సత్యనారాయణను కలిసి ఆశీర్వదించిన క్రిస్టియన్ సోదరులు
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
VZM : శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను శనివారం క్రిస్టియన్ సోదరులు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ ఎస్ మధు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పాస్టర్లు బొత్స సత్యనారాయణను మరియు వారి కుటుంబ సభ్యులను కలసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. అనంతరం పలు సామాజిక అంశాలపై వారు చర్చించారు.