రాష్ట్రంలో ఐదేళ్లలో పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం భారీగా పెరుగుదల

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో హెచ్‌టీ పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం ప్రస్తుత వాడకంతో పోలిస్తే 184.59 శాతం పెరుగుతుందని కేంద్ర విద్యుత్‌ మండలి అంచనా వేసింది. అమరావతి, విశాఖపట్నంలలో ఏర్పాటుకానున్న భారీ పరిశ్రమలు, డేటాసెంటర్ల కారణంగా 2030-31 నాటికి విద్యుత్‌ వినియోగం 1,45,181 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని సీఈఏ ఎలక్ట్రిక్‌ పవర్‌ సర్వే వెల్లడించింది.