తెలుగులో అక్టోబర్ రెండున డోరతీ చిత్రం విడుదల

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన బోల్డ్ అండ్ ఎమోషనల్ డ్రామా చిత్రం డోరతీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్రయూనిట్ వెల్లడించింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సంస్థ అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. లింగ సమానత్వం మరియు జెండర్ రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.