నరసింహకొండ అభివృద్ధికి రూ.8.75 కోట్లతో శంకుస్థాపన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
నెల్లూరు గ్రామీణ మండలం నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. రూ.8.75 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. జిల్లా వ్యాప్తంగా 166 దేవాలయాల పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు.