గాంధీ ఆశయాల సాధనే ప్రభుత్వ లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలోనే ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.