వెంకటాపురంలో మిర్చి తోట ధ్వంసంతో నిలువునా మునిగిన రైతు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: దుగ్గొండి
మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు ఇంగే మనోహర్ సాగు చేసిన మిర్చి తోటను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఎకరం ముప్ పై గుంటల విస్తీర్ణంలో రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటను సోమవారం రాత్రి పూర్తిగా పీకి వేశారు. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.