హైదరాబాద్ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: కాంక్రీట్ జంగిల్గా మారుతున్న భాగ్యనగరంపై పరిశోధకుల ఆందోళన

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో కాంక్రీట్ నిర్మాణాలు విపరీతంగా పెరిగి పచ్చదనం క్షీణిస్తోందని పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా డిస్కవర్ ఎర్త్ అబ్జర్వేషన్ జర్నల్ లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం నగరంలో భూ వినియోగ మార్పుల వల్ల ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు స్పష్టం చేశారు. వేడి తీవ్రతను తగ్గించేందుకు చెరువులు, పార్కులు, వృక్షసంపదను పరిరక్షించాలని హెచ్చరించారు.