రేపు మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా.. మంచర్ల సదానందం

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మంచర్ల సదానందం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి సుమారు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ధర్నాలో విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.