నా జీవితంలో ఇదే చివరి దీపావళి కావొచ్చంటూ 21 ఏళ్ల క్యాన్సర్ బాధితుడి ఆవేదన
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
నా జీవితంలో ఇదే చివరి దీపావళి కావచ్చని, మళ్లీ పండుగను చూడలేనేమోనని ఇరవై ఏళ్ల యువకుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు రెడ్డిట్ పోస్ట్ వెల్లడించింది. నాలుగో స్టేజ్ కొలొరెక్టల్ క్యాన్సర్ తో బాధపడుతున్న తాను చికిత్స తీసుకుంటున్నానని, డాక్టర్లు రోజులు లెక్కపెట్టుకోవచ్చని చెప్పారని ఆ యువకుడు తన పోస్ట్ ద్వారా పేర్కొన్నారు. ఈ కన్నీటి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.