భోపాల్లో రిటైర్డ్ ఐఏఎస్ రాకేష్ అగర్వాల్ దారుణ హత్య
రిపోర్టర్: శివ
స్థలం: Bhopal
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేష్ అగర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. రతిబాద్లోని ఆయన నివాసంలో గొంతు కోసి హత్య చేసినట్లు ఏసీపీ అంకితా ఖతార్కర్ తెలిపారు. కేవలం నాలుగు రోజుల క్రితం ఏజెన్సీ ద్వారా నియమించబడిన కేర్టేకరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లోని అల్మారాలు తెరిచి ఉండటంతో దోపిడీ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. నిందితుడు వరుణ్ కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.