అమెరికాలో ఎస్బీఐ విస్తరణ: టెక్సాస్ లో కొత్త శాఖ ప్రారంభం
రిపోర్టర్: సునీల్
స్థలం: టెక్సాస్
అమెరికాలో తన బ్యాంకింగ్ అనుబంధ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తూ టెక్సాస్ లో కొత్త ఎస్బీఐసీ బ్యాంక్ శాఖను ప్రారంభించినట్లు ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. కాలిఫోర్నియా వెలుపల ఆ అనుబంధ సంస్థకు చెందిన మొదటి కార్యాలయంగా నిలిచిన ఈ నార్త్ డల్లాస్ శాఖ ప్రారంభంతో అమెరికాలో మొత్తం శాఖల సంఖ్య ఎనిమిదికి చేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ విస్తరణ భారత్ అమెరికా సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని వెల్లడించారు.