జన్నారంలో ఉపాధి హామీ రికార్డులను జల్లెడ పడుతున్న ఆడిట్ బృందాలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ కొనసాగుతోంది. మండల పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో చేపట్టిన పనులు అలాగే కూలీలకు అందించిన వేతనాల చెల్లింపులపై ఈ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఆర్పి నాగరాజు మంగళవారం స్పష్టం చేశారు. అధికారుల ఆదేశాల మేరకు పది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం గ్రామ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలిస్తోంది.