రూ.40 లక్షలతో శ్రీ రాములస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
పుల్లంపేట మండలం టీ.కమ్మపల్లి పంచాయతీ పరిధిలోని ఎగవరెడ్డి అరుంధతివాడలో నూతన శ్రీ రాములస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. దేవాదాయ శాఖ ద్వారా మంజూరైన రూ.40 లక్షల నిధులతో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఆధ్యాత్మిక అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.