మురసు తుఫాను నష్టంపై హైఅలర్ట్: 12 జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: Andhra Pradesh

మురసు తుఫాను ప్రభావంపై పన్నెండు జిల్లాల కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సీఎంవో ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. ఈ సమావేశంలో నలభై ఐదు వేల మందికి పైగా అధికారులు పాల్గొన్నారని తెలిపింది. తుఫాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం కోరారని పేర్కొంటూ, పంట నష్టంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.