నాగావళి నదిలో భారీ వరద ప్రవాహమంటూ కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హెచ్చరిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

విజయనగరం కలెక్టరేట్ తుపాను కంట్రోల్ రూమ్ నుంచి నాగావళి నది వరద ప్రవాహాన్ని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పర్యవేక్షించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రవాహం 60 వేల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని తెలిపారు. వంగర, సంతకవిటి, రేగిడి మండలాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను స్పష్టంగా ఆదేశించారు.