గ్రీన్ ఎనర్జీ కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఏపీలో రూ.21,838 కోట్లతో విద్యుత్ విస్తరణ

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 పథకం కింద రూ.21,838 కోట్లతో విద్యుత్ సరఫరా నెట్వర్క్ను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయంలో ముప్పై మూడు శాతం నిధులను గ్రాంట్ కింద సమకూరుస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఈ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ట్రాన్స్కో యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ప్రసార సామర్థ్యాన్ని భారీగా పెంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.