గువాహటి హోటల్ కాల్పుల ఘటన: ఘటనా స్థలంలో డమ్మీలతో సీన్ రీకన్స్ట్రక్షన్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: గువాహటి
గువాహటిలోని హోటల్ బిలాస్ ఇన్ లో జరిగిన ఐదుగురి హత్యల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక విచారణ చేపట్టింది. అక్టోబర్ ఇరవై ఆరో తేదీన జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి సోమవారం ప్రధాన నిందితుడు ఘనకాంత గొగోయ్‌ను ఘటనా స్థలానికి తీసుకువచ్చి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. డమ్మీ బాడీలు, నకిలీ తుపాకీని ఉపయోగించి కాల్పులు జరిగిన తీరును అధికారులు పరిశీలించారు. ఆస్తి వివాదం కారణంగానే ఈ దారుణం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు అధికారులు వెల్లడించారు.