అజిత్కుమార్ మృతికి టీడీపీ జిల్లా అధ్యక్షులు షణ్ముగం రెడ్డి ఘన నివాళి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పుత్తూరు

పుత్తూరు మున్సిపాలిటీ, కె.ఎం. అగ్రహారానికి చెందిన ఎం.మురళి కుమారుడు అజిత్కుమార్ ప్రమాదవశాత్తు అకాల మరణం చెందారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెక్కుడుకుప్పం షణ్ముగం రెడ్డి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అజిత్కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.