భక్తిపారవశ్యంతో పులకించిన వేంకటేశ్వరుని సప్తగిరి శిఖరాలు

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి అర్బన్

కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సీఎం కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.