'సౌకర్యాలు లేవు.. నిర్వాహకుల నిర్లక్ష్యం': జపాన్‌లో భారత అథ్లెట్ల అవస్థలు

రిపోర్టర్: మహేష్ స్థలం: జపాన్

జపాన్‌లోని నగోయా వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన భారత రోయింగ్, షూటింగ్ క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి వసతి సౌకర్యాలు కల్పించకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అథ్లెట్లు నానా అవస్థలు పడ్డారు. రోయింగ్ జట్టుకు సరైన వసతి లేకపోగా, కొందరి పేర్లు అక్రెడిటేషన్ జాబితాలో లేవు. షూటర్లకు రవాణా సౌకర్యం అందక గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ముఖ్య కోచ్ సమరేష్ జంగ్‌కు తప్పుగా అక్రెడిటేషన్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. నిధుల కొరత కారణంగా ఈక్వెస్ట్రియన్ రైడర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.