ఉత్తరప్రదేశ్ లో పూజారులు సహా భార్యను కాల్చి చంపిన నిందితుడు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆజమ్‌గఢ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆజమ్‌గఢ్ జిల్లాలోని శంభుగంజ్ గ్రామంలో పూజా కార్యక్రమం విషయంలో జరిగిన వివాదంతో అరవింద్ సింగ్ అనే వ్యక్తి తన భార్య బబితతో పాటు ఇద్దరు పూజారులు మహేంద్ర పాఠక్, అఖిలేష్ మిశ్రాలను తన రైఫిల్‌తో కాల్చి చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.