విశాఖలో ఇళ్ల పట్టాల పంపిణీ సభా వేదికకు సీఎం చంద్రబాబు
రిపోర్టర్: గోపి
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రికి సభా వేదిక వద్ద లబ్దిదారులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సభికులు తమ స్థానాల్లో లేచి నిలబడి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.