భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ సహచరుడు ఏక్ నాథ్ చిత్నిస్ కన్నుమూత

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ శాస్త్రవేత్త, విక్రమ్ సారాభాయ్ ముఖ్య సహచరుడు ప్రొఫెసర్ ఏక్ నాథ్ వసంత్ చిత్నిస్ వంద సంవత్సరాల వయసులో అక్టోబర్ 22, 2025న కన్నుమూశారు. ఐస్రో వ్యవస్థాపక దశలోనూ, తుంబా రాకెట్ ప్రయోగ కేంద్రం ఎంపికలో ఆయన చేసిన సేవలు ఎనలేనివి.