మూరస్ తుపాను దెబ్బకు అతలాకుతలమైన ఖమ్మం నగరం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలో మూరస్ తుపాను ప్రభావంతో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. చెదురుమదురు జల్లులతో ప్రారంభమైన వర్షం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ బయటకు వెళ్లే వారు గొడుగులు, రెయిన్కోట్లు వినియోగిస్తున్నారు. తుపాను ప్రభావంతో వర్షం కొనసాగుతుండటంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.