డ్రైనేజి వ్యవస్థ లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తీవ్ర ఆందోళన
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
కుక్కునూరు మండలంలోని బెస్తగూడెం గ్రామం ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ముఖ్యంగా డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల పక్కనే మురుగు నీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నీటి నిల్వల కారణంగా దోమలు విపరీతంగా పెరిగి స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.