నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: నాగర్ కర్నూల్

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలలో ఏవో కృష్ణయ్య గారు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారని ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) వెల్లడించారు. అలాగే అదే కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించామని, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం ఆరు అర్జీలు స్వీకరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.