మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో హువావే మేట్ ఎక్స్టీ 2!
రిపోర్టర్: భాస్కర్
స్థలం: China
ప్రముఖ టెక్ దిగ్గజం హువావే ప్రపంచంలోనే రెండో త్రి-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ 'మేట్ ఎక్స్టీ 2 అల్టిమేట్ డిజైన్'ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 10.2 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, కిరిన్ 9050 ప్రొసెసర్, 5,600 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వస్తోంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.2.81 లక్షలుగా ఉంది.