భక్తిశ్రద్ధలతో తొండవాడలో వైభవంగా వినాయక చవితి వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చంద్రగిరి
చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ ఎస్టీ కాలనీలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తపసి మురళి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్థానికులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్టీలు దేశానికి వెన్నెముకలాంటి వారని, ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాలనీ ప్రజలతో మమేకమై అన్నదాన కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో సరదాగా గడిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.