యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో ఘనంగా పండుగ సాయన్న జయంతి

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రంలో తెలంగాణ పోరాటయోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటు స్థలంలో పూజలు నిర్వహించి బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలను కొనియాడారు.