అన్నదాతలకు తీపి కబురు: పీఎం కిసాన్, సుఖీభవ నిధుల విడుదలపై క్లారిటీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
అన్నదాతలకు దసరా పండుగ వేళ ఆర్థిక సాయం అందనుందనే వార్తలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ నిధులతో పాటు ఏపీ ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కలిపి ఒకేసారి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని వెల్లడించారు. రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించారు.