ఫారం 6 వివాదంపై స్పందన: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఉపయోగించే ఫారం ఆరుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం జారీ చేసిన అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ స్పష్టం చేశారు. సవరించిన ఫారం ఆరుకు సుప్రీంకోర్టు ఎటువంటి ఆమోదం తెలపలేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేస్తూ, సంబంధిత రికార్డులను పరిశీలిస్తామని వెల్లడించారు.