విజయవాడలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Vijayawada, Andhra Pradesh

విజయవాడలోని సింగ్ నగర్లో ఉన్న మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పాల్గొన్నారు. లబ్ధిదారులైన మహిళలకు వేదికపై స్వయంగా ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. అనంతరం ఈ భారీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా అధికారులు మరియు ప్రజల వేదికగా స్పష్టం చేసినట్లు సీఎంవో ఆంధ్రప్రదేశ్ అధికారికంగా వెల్లడించింది.