'సహజీవనంలో వివాదం.. ప్రియుడిని హతమార్చిన ప్రియురాలు': విజయనగరంలో ఘటన
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో దారుణ హత్య జరిగింది. భర్తకు దూరంగా ఉంటున్న దనాల రాములమ్మ తన బావ కుమారుడైన శ్రీనుతో కలిసి సహజీవనం చేస్తోంది. గురువారం తెల్లవారుజామున వీరిద్దరి మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో రాములమ్మ ఇనుపరాడ్డుతో శ్రీను తలపై బలంగా కొట్టి, అనంతరం యాసిడ్ పోయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై చీపురుపల్లి సీఐ శంకరరావు, ఎస్సై లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.