ముప్పై ఆరు ఏళ్ల పోలీసు సేవలకు ఎస్సై రామచంద్రారెడ్డికి ఘన సన్మానం
రిపోర్టర్: మహేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లాలో ముప్పై ఆరు ఏళ్ల పాటు విశేష సేవలందించిన ట్రాఫిక్ ఎస్సై రామచంద్రారెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఆయనను జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఘనంగా సన్మానించారు. ఈ మేరకు అనంతపురం పోలీసులు ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించారు. ఎస్సై రామచంద్రారెడ్డి సేవలను జిల్లా ఎస్పీ అభినందిస్తూ శాలువా కప్పి, జ్ఞాపిక అందజేశారు. ఆయన పదవీ విరమణ అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో జీవించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.