అన్నమయ్య జిల్లాలో పూల సాగు: రాయలసీమలో మారుతున్న వ్యవసాయ స్వరూపం

రిపోర్టర్: రాము స్థలం: అన్నమయ్య జిల్లా

రాయలసీమలోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో రైతులు సంప్రదాయ పంటలకు భిన్నంగా పూల సాగు వైపు అడుగులు వేస్తున్నారని స్థానిక వ్యవసాయ నిపుణులు తెలిపారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో సుమారు ఐదు వందల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో బంతి మరియు చామంతి పూలను సాగు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పండించిన పూలను సమీపంలోని బెంగళూరు మార్కెట్ కు తరలిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నట్లు రైతులు వెల్లడించారు.