రాష్ట్రంలో ఎల్నినో తీవ్ర ప్రభావం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో సూపర్ ఎల్నినో తీవ్ర ప్రభావం చూపనుందని, భవిష్యత్తులో తాగు, సాగునీటితో పాటు విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, రైతులను ఆదుకునేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడకుండా నిరంతరం విద్య విద్యను సరఫరా చేస్తున్నామని సీఎం వెల్లడించారు.