అమెరికా హెచ్చరికల వేళ ఇరాన్ కీలక ప్రకటన: సైనికాధికారులను అప్రమత్తం చేసిన మొజ్తబా

రిపోర్టర్: రాము స్థలం: టెహ్రాన్

అమెరికాతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. శత్రువుల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పులనైనా తక్షణమే, భౌగోళిక పరిమితులు లేకుండా తిప్పికొట్టాలని ఆ దేశ సైనికాధికారులను ఆయన ఆదేశించారు. ఇరాన్పై సైనిక దాడులు మళ్లీ మొదలైతే తీవ్రంగా ప్రతిఘటించాలని సాయుధ దళాల ఉన్నతాధికారుల సమావేశంలో మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.