చంద్రబాబు అరెస్ట్ చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ నారువలో కొవ్వొత్తుల నిరసన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రణస్థలం
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని గతంలో అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచిన చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామ పంచాయతీలో నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ సర్పంచ్ నిద్రబంగి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆనాటి దుర్ఘటనను నెమరువేసుకుంటూ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ ఇళ్లలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.