మాల్‌లో సేల్స్‌వుమెన్‌పై దాడి: క్లీనర్‌కు ఏడాది జైలు శిక్ష

రిపోర్టర్: గోపి స్థలం: మహారాష్ట్ర

ముంబైలోని ఓ మాల్‌లో సేల్స్‌వుమెన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన క్లీనర్‌కు స్థానిక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. కిందపడిపోతే ముద్దు పెట్టడం సహజం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడు జారిపడ్డానని చెప్పిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. బాధితురాలి సాక్ష్యం ఆధారంగా బీఎన్‌ఎస్ చట్టం కింద ఈ సంచలన తీర్పు వెలువడింది.