తాగునీరు లేక చుక్కల కోసం అల్లాడుతున్న తాడ్వాయి పల్లెసీమల జనం

రిపోర్టర్: రాము స్థలం: తాడ్వాయి

తాడ్వాయి గ్రామంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు రాక ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. సర్పంచ్ మెట్టు విజయ రాము చందాపూర్ పంప్‌హౌస్‌ను పరిశీలించగా మోటార్లు సక్రమంగానే పనిచేస్తున్నప్పటికీ నీరు వృథాగా పోతున్నట్లు తేలింది. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగానే నీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటి కొరతను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.